Vaishnav Tej : మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అర డజను హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ‘కొండ పొలం’ సినిమాతో వచ్చినా ఆ సినిమా ఎపుడు వచ్చిందో, పాయిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఇక మళ్ళీ గిరీశాయా దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘రంగ రంగం వైభవంగా’. ఇక ఈ సినిమా ఇంటర్వ్యూ ల్లోనే వైష్ణవ్ తేజ్ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంత బోల్డ్ కామెంట్స్ చేసావేంటి బ్రో అనేలా మాట్లాడాడు.

రష్మీ ఎక్స్ప్రెషన్స్ హాట్ గా ఉంటాయి…
రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ సందర్బంగా మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ మీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే ఏ హీరోయిన్ తో చేయాలనుకుంటారు అని అడుగగా ఏ మాత్రం ఆలోచించకుండా వైష్ణవ్ తేజ్ రష్మీ అని సమాధానం చెప్పాడు. మళ్ళీ దానికి వివరణ కూడా ఇచ్చాడు వైష్ణవ్. రష్మీ హాట్ ఎక్స్ప్రెషన్స్ పలికించే తీరు చాలా బాగుంటుందని అందుకే తనను ఐటమ్ సాంగ్ లో పెట్టుకోవాలని ఉందని సమాధానం చెప్పాడు.

ఇక ఈ ఆన్సర్ కి అందరూ ఆశ్చర్య పోయారు. ఇంత బోల్డ్ గా అలా ఎలా మాట్లాడవు అంటూ వైష్ణవ్ ను నెటిజన్స్ అంటున్నారు. ఇక వైష్ణవ్ ఇంట్రెస్ట్ చూస్తుంటే తన నెక్స్ట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో రష్మీ తో ఆడి పాడతాడేమో చూడాలి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా కూడా నిరాశపరిచి వరుసగా రెండు ప్లాప్ లను మూటగట్టుకున్నాడు ఈ మెగా కుర్రహీరో.



























