Vakada Apparao : తెలుగులో ఇంటిదొంగ సినిమాతో ప్రొడ్యూసర్ గా మొదలైన వాకాడ అప్పారావు ఆ తరువాత అత్తమెచ్చిన అల్లుడు, మహరధి వంటి సినిమాలకు నిర్మాత. హిందీ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసిన వాకాడ ఒకానొక దశలో హిందీ సినిమా విషయంలో నష్టపోవడంతో అప్పట్లో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న ఆర్ బి చౌదరి గారి సహాయం వల్ల నిలదొక్కుకున్నారు. ఇక ఆర్ బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ స్థాపించాక ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ బాధ్యతలు చూసుకునే వారు.
చిరంజీవి అలాంటివాడు…. రామ్ చరణ్ తో గొడవలు…

సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణం సంస్థ ద్వారా చాలా సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్న వాకాడ అప్పారావుకు మెగాస్టార్ చిరు తో మంచి అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యం తోనే కొణిదెల ప్రొడక్షన్స్ పనులు చూసుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు. ఇక ఆచార్య సినిమా అప్పుడు అక్కడ ఉన్నారంటు చెప్పారు. సైరా సినిమా అప్పుడు రామ్ చరణ్ స్వయంగా పిలిచి కొణిదెల ప్రొడక్షన్ హౌస్ పనులు చూసుకోమని చెప్పారట ఆ సమయంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఏ సినిమాలు లేకపోవడంతో పని లేక ఖాళీగా ఉన్న వాకాడ అప్పారావు కి బాధ్యతలు ఇచ్చారట చరణ్. చరణ్ చాలా సన్నిహితంగా ఉంటాడని, తనతో ఎలాంటి గొడవలు లేవని గాడ్ ఫాదర్ సినిమా వర్క్ చూసుకోవడం కోసం ఆచార్య సినిమా లో కొన్నిరోజుల వర్క్ తరువాత తప్పుకున్నానని చెప్పారు.

చిరంజీవి ఒక మనిషిని బాగా అంచనా వేయగలరని, ఆయనకు సినిమా మీద పట్టు చాలా బాగుందంటూ చెప్పారు. ఒక మనిషి ఆయన దగ్గరకు వస్తే ఎందుకోచ్చాడో పట్టేస్తారని అవులిస్తే పేగులు లెక్కబెట్టేరకం అంటూ చెప్పారు. కానీ ఏ రోజు చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ కోప్పడటం లాంటివి చేయలేదని చాలా సౌమ్యంగా మాట్లాడుతారని చెప్పాడు షూటింగులో డైరెక్టర్ షాట్ ఎలా పెడుతున్నాడో కూడా చిరు పటేస్తారని ఒకవేళ తప్పుగా ఉంటే పక్కకు పిలిచి చెప్తారు కానీ అందరిలో చెప్పరని, నేను ప్రొడ్యూసర్ గా ఏమైనా సలహా ఇచ్చిన డైరెక్టర్ కు చెప్పమనే వారు ఆయన డైరెక్టర్లకు అంత గౌరవం ఇస్తారంటు చెప్పారు. ఇక అప్పారావు గారు చిరంజీవి గారి రీమేక్ సినిమా గాడ్ ఫాదర్ కి కూడా పని చేస్తున్నారు.



























