Vande Bharath Express : కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ గిఫ్ట్ ఇచ్చింది. దేశంలో ఎనిమిదవ ఫాస్ట్ ట్రైన్ అయిన వందే భారత్ ను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జనవరి 16న ప్రారంభం అయిన ఈ ట్రైన్ విశేషాలు, టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.

తగ్గిన ప్రయాణ సమయం… సామాన్యులకు ఊరట…
సంక్రాంతి లాంటి పండగలు వచ్చాయాంటే హైదరాబాద్ నుండి విజయవాడ అటు కోస్తా జిల్లాలకు వెళ్లే జనంతో ఎక్కువ ఆ సమయంలో బస్సులు, ట్రైన్లు కిక్కిరిసిపోతాయి. అదీ కాక ప్రయాణం ఎక్కువ సేపు అయితే ఇప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ప్రయాణం సమయం నాలుగు గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ కు 4 గంటల 20 నిమిషాల సమయం అలాగే సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్లాలంటే 8 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది.

సౌత్ లో ప్రవేశ పెట్టిన రెండో వందే భారత్ ట్రైన్ ఇది. వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ స్టేషన్స్ లో ఆగుతుంది ట్రైన్. అలాగే తెలంగాణ లో ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ లో ఆగుతుంది. ఆదివారం మినహా వైజాగ్ లో ఉదయం 5:45 నిమిషాలకు ట్రైన్ బయలుదేరుతుంది. 1100 సీట్ల కెపాసిటీ తో ఉన్న ఈ హై స్పీడ్ ట్రైన్ నిన్నటికే 70 % టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే చెయిర్ కార్ కేటగిరి కాస్ట్ రూ. 1720గా ఉంది. ఎగ్జిక్యూటివ్ చెయిర్ ధర రూ. 3170. ఫుడ్, ట్యాక్సులు కలుపుకొని ఈ ధరలు ఉంటాయి. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. రెండు ఎగ్జిక్యూటివ్ చెయిర్స్ కోచ్‌లు ఉంటాయి.































