Vanga Geetha: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. చివరిగా పిఠాపురంలో తన ఎన్నికల ప్రసంగాన్ని ముగించనున్నారు. నేటితో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తికానున్న నేపథ్యంలో ఈయన చివరి ప్రసంగం పిఠాపురంలో నిర్వహించారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో భాగంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆయనకు జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే న్యాయం జరగదని జగన్ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఈ పిఠాపురం సభలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..
వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగినటువంటి వంగా గీత గారు నాకు ఒక తల్లి లాంటిది అక్క లాంటిది ఈమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేసి పిఠాపురం పంపిస్తానని మాట ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎంగా మీ నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగిస్తారు అంటూ ఈ సందర్భంగా జగన్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం…
ఈ విధంగా పిఠాపురం పర్యటనలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వంగ గీతాను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడమే కాకుండా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అనే భారీ స్థాయిలో పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు విజయ్ కేతనం ఎగరవేస్తారనేది తెలియాల్సి ఉంది.





























