Vanisri Assistant Ramanaiah : నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ . తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది . ఇక ఆమె సినిమా కెరీర్ గురించి పలు విషయాలను ఆమె కు అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఎన్టీఆర్ తో ఆ సినిమాలో నటించినందుకు బాధపడ్డారు….
వాణిశ్రీ గారు గ్లామర్ పాత్రలను చేయడానికి, అలానే పరిమితికి మించి రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడేవారట. దాదాపు గా అలాంటి సినిమాలను చేసేవారు కాదట. అలాంటిది ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఒక సినిమా చేసాక ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అలాంటి బట్టలు వేయకుండా ఉండాల్సిందంటూ చాలా రోజులు బాధపడ్డారు అంటూ ఆమె వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య తెలిపారు. ఇక ఒక తమిళ ప్రేమ్ నగర్ సినిమాలో నటించేటపుడు చాలా ఇబ్బందిపడ్డారంటు తెలిపారు.

జర్నలిస్ట్ ను చెప్పుతో కొట్టిన వాణిశ్రీ….
సినిమా వాళ్ళ మీద అవి ఇవి గాసిప్స్ రాయడం మామూలే. అందరూ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గురించి ఇలాంటివి రాయడం ఒక్కోసారి జనాలు కొన్నిటిని నిజం అనుకోవడం మళ్ళీ ఆ సినిమా తార క్లారిటీ ఇవ్వడం జరుగుతుంటోంది. అయితే వాణిశ్రీ గారి గురించి ఆమె కుటుంబం గురించి ఒక జర్నలిస్ట్ తప్పుగా రాయగా ఆమె కోపడ్డారంటు రమణయ్య తెలిపారు. ఆ జర్నలిస్ట్ ను పిలిచి ఒకసారి అలా నిజాలు కానివి రాయకండి అని చెప్పినా ఆ జర్నలిస్ట్ వినకుండా మరోసారి వాణిశ్రీ గురించి ఆమె కుటుంబం గురించి రాయడంతో షూటింగ్ అప్పుడు ఆ జర్నలిస్ట్ కనిపించగా అతను హీరో హరినాథ్ స్నేహితుడు అని తెలిసిన నా గురించి రాసిన పట్టించుకోను నా కుటుంబం గురించి అలా రాయొద్దని చెప్పినా మళ్ళీ అలానే ఎందుకు రాసావు అంటూ చెప్పుతో కొట్టిందట వాణిశ్రీ. అక్కడే సెట్స్ లో హరినాథ్ గారు ఉన్నా మౌనంగా ఉండిపోయారట. కోపం వస్తే అలానే వాణిశ్రీ ఎవరిని లెక్కచేయరు అంటూ రమణయ్య గారు తెలిపారు.






























