సీనియర్ నటుడు విజయ్ కుమార్ – మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ కు ఆల్ రెడీ పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలున్నారు. నటి వనిత విజయ్ కుమార్‌ కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో 2 పెళ్ళిళ్ళు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఇంకా తన తండ్రి విజయ్ కుమార్‌ తో జరిగిన ఆస్తి గొడవల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా వివాదాస్పదమైన అంశాలతోనే ఎక్కువ గుర్తింపు సంపాదించింది. తాజాగా వనితా విజయ్ కుమార్ 3వ పెళ్ళి చేసుకుని సంచలనం సృష్టించింది. వనితా పెళ్ళాడిన 3వ భర్త పేరు పీటర్ పాల్. ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్. అయితే, ఈయనకు ఇదివరకే పెళ్ళవడంతో పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ ఇపుడు చెన్నై, వడపళని పోలీసులకు “తన నుంచి విడాకులు తీసుకోకుండానే పీటర్ పాల్ మరో పెళ్లి చేసుకున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా విడివిడిగానే ఉంటున్నామని” కంప్లైంట్ ఇచ్చింది. తమిళ నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ ల పెళ్లి జరిగి వారమౌతున్నా ఇప్పటికీ ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో వనిత కూడా చాలా సీరియస్ గా “ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే మొగుడు గుర్తొచ్చాడా.?” అంటూ ఘాటుగానే స్పందించింది. ఎలిజబెత్ కేవలం డబ్బులు గుంజడానికి ఈ డ్రామా ఆడుతుందని మండిపడింది వనిత విజయ్ కుమార్. ఇదిలా వుండగా.. ఇప్పుడు మరో వివాదంలో కూడా వనితా పేరే సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. తాజాగా తన 3వ భర్త పీటర్ పాల్ గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న గాసిప్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత 2 పెళ్లిళ్లు విఫలమైన తర్వాత నటి వనిత విజయకుమార్ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను 3వ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ పాల్ మొదటి భార్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన భర్తకు నిజంగా విడాకులు తీసుకునే ఆలోచనే లేదని వనిత నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కోసం ఆమె ఇంటిలో కొంతకాలం ఉన్న తన భర్త పీటర్ పాల్ ను లొంగదీసుకుని వనిత పెళ్ళి చేసుకుందని, తన భర్త బాగా తాగుతాడని, తరుచూ అమ్మాయిల గొడవల్లో చిక్కుకుంటాడని, తన భర్త ఏం చేసినా తాను ఇప్పటివరకూ భరించానని, ఇప్పుడందరూ నీ భర్త మరో పెళ్లి చేసుకున్నాడటగా..? అని సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తుంటే చాలా బాధగా ఉందని, ప్రస్తుతం పీటర్ పాలుకి ఎలాంటి
ఆదాయం లేదని, అందుకే కేవలం డబ్బు కోసమే ఆయన వనితను పెళ్ళి చేసుకున్నాడని, తన పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని” ఆవేదన చెందుతూ ఎలిజబెత్ చెప్పడంతో ఈ వివాదం క్రొత్త మలుపు తిరిగింది.

ఇదే విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు వనితా దగ్గర ప్రస్తావించగా.. వనిత మాత్రం తన భర్త తాగడని, మాంసాహారం కూడా తినడని చెప్పింది. పెళ్లిలో కూడా పీటర్ పాల్ తాగింది, మధ్యం కాదని ఆ వీడియోలో ఉన్నది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వనిత. లేటెస్ట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో వనిత షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లందరికీ వనిత గతంలో చెప్పినవన్ని అబద్దాలేనని తెలియడంతో షాకయ్యారు. వనితా సొంత యూట్యూబ్ ఛానెల్లో ఆమె షేర్ చేసిన వీడియోలో స్వయంగా వనితాయే వండిన చికెన్ కబాబ్ పీసును పీటర్ టేస్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడటంతో ఇప్పుడు నెటిజన్లందరూ వనితాపై విమర్శలు గుప్పిస్తూ కారాలూ.. మిరియాలు నూరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here