వనితా విజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక విషయం గురించి ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఐదోసారి ప్రేమలో పడ్డానని తెలపడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వనితా విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. సినిమాలలో నటించి పాపులర్ అవడం కన్నా నిజ జీవితంలో ఏదో ఒక వివాదంతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ముగ్గురితో కూడా పెళ్లి పెట్టకులు చేసుకున్నారు.

అయితే చాలా రోజులు గ్యాప్ తరువాత వనిత ‘మళ్లీ ప్రేమలో పడ్డానంటూ’ మరో పోస్ట్ చేశారు. కానీ దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య మరోసారి వనిత పెళ్లి మీద మరికొన్ని రూమర్లు వచ్చాయి. ఈసారి వాటిని ఖండిస్తూ తాజా ఓక పోస్ట్ చేసింది వనితా. అందులో ‘తాను సింగిల్ అని అందరికీ అందుబాటులోనే ఉన్నాను’ అంటూ కన్నుకొడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇక దీనిపై మండిపడ్డారు ఓ నెటిజన్. అలా చెప్పడం అందుబాటులోనే ఉన్నానని అనడం ఏంటి? నీకు అస్సలు బాధ్యత లేదా? మీకు ఎదిగిన పిల్లలున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఆ నెటిజన్ పెట్టిన కామెంట్‌ పై భగ్గుమన్నారు వనిత. ఎలా ఉండాలో నాకు తెలుసు.. నీ బతుకు నీ బతుకు.. నాకు అవసరం ఉంటే నువ్వొచ్చి ఏమీ పెట్టడం లేదు కదా?.. నా నటన నచ్చితే నా వీడియోలు చూడు లేదంటే నీ పని నువ్ చూసుకో అంటూ చురకలు అంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here