Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్.. అటు తమిళంలో ఇటు తెలుగులో అందరికీ సుపరిచితురాలు. చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వరలక్ష్మి తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. సీనియర్ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వరలక్ష్మి ప్రస్తుతం హీరోలకు ధీటుగా పవర్ ఫుల్ పాత్రలో విలన్ గా చేస్తూ మెప్పిస్తోంది. ఇక వరలక్ష్మి మీద నెటిజన్స్ ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. తన మీద వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోని వరలక్ష్మి చాలా బోల్డ్ గా మాట్లాడుతుంటుంది. ఏదైనా చెప్పాలన్నా ముక్కుసూటిగా మొహం మీదే చెప్పే వరలక్ష్మి ని నెటిజన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే…

ఆంటీ అంటావేంటి…
శరత్ కుమార్ గారి రెండో భార్య రాధికా శరత్ కుమార్. రాధికా సీనియర్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషలలోనే కాకుండా సౌత్ వారు అందరికీ బాగా తెలుసు. ఇక రాధిక గారి 60 వ పుట్టినరోజు సందర్బంగా గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ పుట్టినరోజు సందర్బంగా వరలక్ష్మి రాధిక కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆంటీ అంటూ పిలవడం తో నెటిజన్స్ దాన్ని తప్పుబడుతున్నారు.

Happpyyyyyy 60th birthday aunty….loveeeee you…u r such an inspiration to us all…age is just a number and you are proof of that..muuahhh..have a good trip aunty..see u soon..muahhh 60 and fabulous..???????????????? @realradikaa pic.twitter.com/HaU3jBlxYL
— ???????????????????????????????????? ???????????????????????????????????????????? (@varusarath5) August 21, 2022
’60 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆంటీ, మీరు మాకాందరికీ స్ఫూర్తినిచ్చారు… లవ్ యూ… ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అని మీరు ప్రూఫ్… హావ్ ఏ గుడ్ ట్రిప్.. సీ యూ సూన్’ అంటూ వరలక్ష్మి పోస్ట్ పెట్టింది. ఇక దీనిపై నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంటీ ఏంటి అమ్మ అని పిలవలేవా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే వరలక్ష్మి ఇంతకుముందు పాత ఇంటర్వ్యూ ల్లోనే తాను రాధికాను ఆంటీ అనడానికి గల కారణాలను వివరించింది. రాధిక మా నాన్న రెండో భార్య కానీ నాకు తల్లి కాదు, నా కన్న తల్లిని అమ్మ అంటాను. రాధిక గారిని ముందు నుండి ఆంటీ అని పిలవడం అలవాటు అంటూ చెప్పింది. అయినా ఇప్పుడు మళ్ళీ ఇలా నెటిజన్స్ ట్రోల్ చేయడంతో ఈసారి వరలక్ష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.



























