వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో.. అంతకు మించిన రేంజ్ లో నటిస్తున్నారు నవతరం బుల్లితెర యాంకర్స్. మారుతున్న ట్రెండ్ ను క్యాచ్ చేసుకుంటూ అందాల ఆరబోతకు తమ తమ గ్లామర్ ప్రతిభను జోడించి బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నారు.

ఉదయభాను, ఝాన్సీ, సుమలాంటి యాంకర్స్ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకర్షిస్తుంటే.. తమ నటనా చాతుర్యానికి అందాల ఆరబోతను కూడా జత చేస్తూ బుల్లితెర ఆడియన్స్ కి కొత్త టేస్ట్ ను రుచి చూపిస్తున్నారు రష్మీ, అనసూయ, శ్రీ ముఖి. అందాల విందు చేస్తూ పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్నారు ఈ టాలీవుడ్ బ్యూటీలు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా వాళ్ళ బాటలోనే నడుస్తూ తమ అందాలకు అడ్డే లేదన్నట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు విష్ణు ప్రియ, వర్షిణి. ఒక ముక్కలో చెప్పాలంటే.. రష్మీ, అనసూయల తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు విష్ణు ప్రియ, వర్షిణి. ఢీ, పటాస్ లాంటి బుల్లితెర షోస్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ తమ అందాల రుచి చూపించారు.

బుల్లితెరపై రెచ్చిపోయి రొమాన్స్ చేయడానికి ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు దూసుకు వెళ్ళడంతో నేటి యాంకర్లకు ఈ లాజిక్ భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని తెచ్చి పెడుతోంది. దీంతో వీళ్లకు సంబంధించిన అన్ని విషయాలు ప్రతి రోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో తన తోటి యాంకర్ విష్ణుప్రియతో వర్షిణికి గొడవలు వున్నాయంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ వర్షిణి.. విష్ణు ప్రియతో తనకెలాంటి గొడవలు లేవని వివరిస్తూ.. ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతమున్న బుల్లితెర యాంకర్లలో ఎవరికి ఎంత రేటింగ్ ఇస్తారు? ఎవరు ముందు.. ఎవరు లాస్ట్? అనే ప్రశ్నపై మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన వర్షిణి.. విష్ణు ప్రియకు చివరి స్థానం ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన దృష్టిలో యాంకర్స్ పర్ఫార్మెన్స్ పరంగా తొలి స్థానంలో సుమ, 2వ స్థానంలో ఝాన్సీ, 3వ స్థానంలో శ్రీముఖి, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రష్మి, అనసూయ పేర్లు చెప్పిన వర్షిణి.. 6వ స్థానం మాత్రం తనదే అని తేల్చి చెప్పింది. ఇక తన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా 7వ స్థానంలో విష్ణు ప్రియ ఉన్నట్లు తెలియజేసింది. వర్షిణీ తెలిపిన ఈ అభిప్రాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవడంతో వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న వివాదానికి ఇదే నిదర్శనం అన్నట్టు తేల్చేశారు నెటిజన్లు.



























