Varun Tej Ghani : మెగా ప్రిన్స్ గా అభిమానులతో పిలవబడే వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ నుండి వచ్చినా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విభిన్న చిత్రాలను చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ, వాల్మీకి వంటి భిన్న చిత్రాలను చేస్తూ అటు హిట్ కొడుతూ మరో వైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు వరుణ్ తేజ్. ఇపుడు నటిస్తున్న చిత్రం గని తన కెరీర్ లోనే పెద్ద బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకోసం కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ కూడా వేసాడు. సినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మేష మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త షాక్ కి గురిచేస్తోంది. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్, ఓటీటీ రైట్స్ 25కోట్లకు అమ్ముడఅయ్యాయి. కేవలం ట్రైలర్ చూసి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు.సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.సాయి కొర్రపాటి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ షయా మంజ్రేకర్ హీరోయిన్‌గా వరుణ్ సరసన నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.



























