Varun Tej -Lavanya Tripati:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వార్తల గురించి ఎక్కడ వీరు స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అలాగే ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి.

జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారంట వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై మెగా ఫ్యామిలీ ఎక్కడ స్పందించకపోవడంతో అందరిలోనూ కొంత సందేహం ఏర్పడింది. అయితే తాజాగా మెగా కాంపౌండ్ నుంచి వీరి నిశ్చితార్థం గురించి అధికారక ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ టీమ్ స్పందిస్తూ జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటించారు. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరు కాబోతుందని ఇండస్ట్రీకి చెందినటువంటి ఎవరిని కూడా ఆహ్వానించలేదని తెలుస్తుంది. ఇలా నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందని, పెళ్లి మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని సమాచారం.

Varun Tej -Lavanya Tripati: మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో వరుణ్ ఎంగేజ్మెంట్..
ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రేపే నిశ్చితార్థం జరుపుకోవాలని తెలియడంతో మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి వరుణ్ జంటకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసింది.
The moment we’ve been waiting for has arrived????❤️
It’s official????????????
Hearty congratulations to
???????????????? ???????????????????????? @IAmVarunTej & @Itslavanya on getting Engaged on 9th June, 2023 ????????Wishing a lifetime of happiness together✨#VarunTejKonidela #VarunTej #LavanyaTripathi pic.twitter.com/jkcge86JnG
— SivaCherry (@sivacherry9) June 8, 2023





























