టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో వరుణ్ తేజ్ ఒకడు. గతంలోనే వరుణ్ తేజ్ పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ సమయంలో చాలామంది సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు సైతం తమ పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి ఒక ఇంటి వాళ్లయ్యారు. నితిన్, నిఖిల్ ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకోవడం త్వరలో రానా పెళ్లి జరగనుండటంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అనే చర్చ జరుగుతోంది. నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం జరగడంతో మెగాభిమానులు సంతోషించగా వరుణ్ తేజ్ పెళ్లి వార్త వారిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే వరుణ్ తేజ్ పెళ్లి వార్తను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే నటి వరుణ్ తో కలిసి ఒక సినిమాలో నటించింది. వరుణ్ ఆ హీరోయిన్ షూటింగ్ టైమ్ లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారని సమాచారం. ఈ జంట కలిసి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తపై వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నిహారిక పెళ్లి తరువాత వరుణ్ పెళ్లి జరగనుందని… వరుణ్ పెళ్లి గురించి నాగబాబు ఫ్యామిలీలో భారీగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. వరుణ్ పెళ్లి కూడా నిశ్చయమైతే మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పాలి. నాగబాబు నిహారిక, వరుణ్ తేజ్ పెళ్లిళ్లను గ్రాండ్ గా జరపాలని భావిస్తున్నాడని సమాచారం.



























