Veera Simha Reddy first review : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘వీర సింహా రెడ్డి’. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ‘అఖండ’ సినిమా విజయంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య బాబు, క్రాక్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేనిల కాంబనేషన్ వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకల ముందుకు…
మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి సినిమా జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా మంచి హిట్ టాక్ తో అలరిస్తున్నాయి. ఇక సెన్సార్ రిపోర్ట్ కూడా అదిరిపోయింది. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు తన రివ్యూని తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారని ఉమైర్ తెలిపారు. చిత్రాన్ని అన్నీ తానై ముందుకు నడిపించారట. బాలయ్య బాబు రెండు పాత్రల్లో చూపిన వైవిద్యం చాలా ఆకట్టుకుందని, మాస్ ఆడియన్స్ కి ఇంకా బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అని చెప్పారు.

ఇక బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ అందుకు అనుగుణంగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి అని చెప్పారు. సినిమాలో ఎమోషన్ కూడా బాగా పండిందని, ఫ్యామిలీ ఆడయన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇక సినిమాలోని డాన్స్, ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ లోని 15 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అని ఉమైర్ సంధు చెప్పారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు 3.5/5 రేటింగ్ ఇచ్చాడు. ఇతని రివ్యూ చూసిన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఏదేమైనా ఇంకో రెండు రోజుల్లో కనువిందు చేయడానికి వీర సింహా రెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.
































