రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీల తీరుపై ఆవేదన చెందిన ఆయన కంట తడి పెట్టుకున్నారు. సభలో అందోళన చేస్తున్న సమయంలో కొందరూ ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం చూసిన ఛైర్మన్.. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ పవిత్రత దెబ్బతిట్టుందని అవేదన పూరితంగా వ్యాఖ్యానించారు.

“ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయంలాంటిది. అలాంది పోడియం ఎక్కి నిరసన తెలపడం గర్భగుడిలో ఆపవిత్రంగా పవర్తించినట్లే… ఇలాంటి పరిణామాలు చూస్తుంటే నిద్రపట్టేలా లేదు. నా బాధను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. సభ కార్యకలాపాలను అడ్డు పడడం మంచిది కాదని ” వెంకయ్య నాయుడు తెలిపారు.

































