“రంగ్ దే కి నితిన్ నా ఫస్ట్ ఛాయిస్ కాదు”.. అసలు నిజాన్ని బయటపెట్టిన దర్శకుడు..!!

0
455

పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్ కాస్త స్పీడ్ పెంచాడు.. గత ఎడాది వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ హిట్ కొట్టిన ఏ హీరో ఈ ఎడాది చెక్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు..ఇక నెల రోజుల గ్యాప్ లోనే ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమాతో మన ముందుకు వచ్చేసాడు.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది.. ఇక ఈ రోజే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది.. ఈ నేపధ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు..

ఇక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ..” నిజానికి నేను ఈ కథ రాసుకున్న తర్వాత మొదట నితిన్‌ను కాకుండా వేరే హీరోలను అనుకున్నాను. ఈ సినిమా చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుకు వచ్చాక, నితిన్ పేరును నిర్మాత నాగవంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోననే సందేహంతోనే నేను కథ చెప్పాను. తను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయడంతో నమ్మలేకపోయాను. కథను ఆయన అంతగా నమ్మాడు. నితిన్‌, కీర్తి అంతగా ఈ కథను నమ్మడంతో వాళ్ల పాత్రలతో మరింత బాగా ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేశాక నా సినిమాలకు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై నా నమ్మకం ఇంకా పెరిగిందంటూ చెప్పాడు వెంకీ..

ఇక నితిన్ తో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ..”నితిన్ నాకు పదిహేనేళ్లుగా పరిచయం. అందువల్ల నాకు తనతో సెట్స్ మీద చాలా సౌకర్యంగా అనిపించింది. కీర్తి విషయానికి వస్తే, ఆమె వెనుక ‘మహానటి’తో వచ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫర్ట్ అట్మాస్పియర్‌ను ఆమె క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్దరితో చాలా సౌకర్యంగా ఈ సినిమా చేశాను. నా కంటే ఈ సబ్జెక్టును నితిన్‌, కీర్తి గట్టిగా నమ్మారని” ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వెంకీ.. ఇక ఈ తన తర్వాతి సినిమా అగ్ర నిర్మాణ సంస్థ లోనే ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు ఈ దర్శకుడు…!!