Venu Swamy: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గతంలో సమంత నాగచైతన్య వివాహం, విడాకుల గురించి చెప్పిన వేణు స్వామి తాజాగా ప్రభాస్ జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి 2023 వ సంవత్సరంలో ప్రభాస్ జాతకం ఎలా ఉంటుందో అన్న విషయాల గురించి వెల్లడించాడు.

పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిన ప్రభాస్ కి జాతకాల పట్ల నమ్మకం లేదని.. అందువల్లే ఆయన తీసిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవుతున్నాయని వేణు స్వామి వెల్లడించాడు. ప్రభాస్ జాతకం ప్రకారం.. 2023 వ సంవత్సరంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్యపరమైన సమస్యలతోపాటు సినిమాకు సంబంధించిన సమస్యలు ప్రభాస్ ని చుట్టుముడతాయని ఆయన వెల్లడించాడు.
జాతకాల పట్ల నమ్మకం లేకుండా జాతకాలకు సంబంధించిన సినిమా తీయడం వల్లే ప్రభాస్ తీసిన ఒక సినిమా ప్లాఫ్ అయిందని ఈ సందర్భంగా వెల్లడించాడు. ప్రభాస్ జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో శని దోషం ఉండటం వల్ల ఆయన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించాడు. వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన జాతకాలు నిజం అవ్వటంతో ఇప్పుడు ప్రభాస్ గురించి ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాగచైతన్య సమంత వివాహ సమయంలో వారు విడిపోతారని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదని, కానీ ఇప్పుడు వారు విడిపోయారని గుర్తు చేశాడు.

Venu Swamy: వేణు స్వామి మాటలను కొట్టి పారేస్తున్న అభిమానులు…
ఇక నయనతార పెళ్లి విషయంలో కూడా ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్నాయని వేణు స్వామి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేశాడు. ఇలా సెలబ్రిటీ ఇలా జాతకాల ప్రకారం వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కావటంతో కొందరు అభిమానులు ఆందోళన చెందుతుంటే మరికొందరు మాత్రం వేణు స్వామిని ట్రోల్
చేస్తున్నారు.






























