Prabhas prediction : ఉగాది అనగానే ఉగాది పంచాంగం గుర్తొస్తుంది. ఈ ఏడాది ఇలా ఉండబోతోంది పంటలు ఇలా పండుతాయి అంటూ తెలుసుకోవాలని అందరు భావిస్తారు. అయితే రాజకీయ ప్రముఖులు వినిమా వల్ల జాతకలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు అందరు. ఇక ప్రభుత్వం పంచాంగ శ్రావణ కార్యక్రమం జరపడం ఉగాది రోజున ఆనవాయితి.

ఇక ప్రభాస్ జాతకం ఈ ఏడాది ఇలా ఉండబోతోంది అంటూ వేణు స్వామి అనే ప్రముఖ జోతిష్యుడు చెబుతున్నాడు. ఆయన చెప్పిన విషయాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి గతంలో సమంత నాగచైతన్య ల విడాకుల ఇష్యూ ని తనవైపు తిప్పుకుని బాగానే పాపులర్ అయ్యారు. ఇక ఇపుడు ప్రభాస్ విషయం లో కూడా వేలుపెట్టారు.

ప్రభాస్ తో సినిమా నిర్మాతకు కష్టం…..
ప్రభాస్ తో సినిమా తీయాలనుకునే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ప్రభాస్ నటించే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతాయాని ప్రిడిక్షన్ చెప్పారు. ప్రభాస్ తో భారీ బడ్జెట్ మూవీ తీయ్యోద్దంటూ నిర్మాతలకు హితవు పలికారు. ఇక ఈ విషయం వైరల్ అయి ప్రబ్జాస్ ఫ్యాన్స్ అగ్రహానికి కారణమైంది. ఇక వేణుస్వామి పై ట్రోలింగ్ మొదలుపెట్టారు.వేణు స్వామి చెప్పిన జాతకం నమ్మాల్సిన అవసరం లేదని.. ఆయన చెప్పిన జాతకాలు ఖచ్చితంగా జరగలేదని అంటున్నారు.

జగన్, చంద్రబాబుల సంగతేంటి…..
ఇక సీఎం జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ను వదల్లేదు వేణు స్వామి. జగన్ కు బుధ మహర్థశ నడుస్తోందని ఏది ఇంకా 17 ఉంటుందని చెప్పారు. ఇక చంద్రబాబుకు అష్టమ శని ఈ ఏప్రిల్ 23 నుండి మొదలవుబోతోందని తెలిపారు. జగన్ జైలుకు వెళ్తారా అనిడిగిన ప్రశ్నకు జగనన్న జైలుకి వెళ్లే యోగం లేదు ఒకవేళ వెళ్లిన తన స్థానం లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందిపెద్దిరెడ్డి జాతకం రీత్యా సీఎం అయ్యే యోగం ఉందని..ఈ మాటలను రికార్డ్ చేసుకోవచ్చు అంటూ ధీమాగా చెప్పారు.

































