Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన వేణు తోట్టెంపూడి ఆ తరువాత చిరునవ్వుతో, సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిరునవ్వుతో సినిమాలో నటనకు వేణు కి అలాగే డైలాగులకు త్రివిక్రమ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ చేసిన వేణు కెరీర్ లో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరేళితే, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. తోమిదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వైపు చూసిన వేణు, రవితేజ తో కలిసి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను చేసారు. ఈ సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న వేణు తన కెరీర్ లో చేసిన తప్పులను, విశేషాలను చెప్పారు.

త్రివిక్రమ్ తో ఆ సినిమా వదులుకున్నా…
చిరునవ్వు తో సినిమాతో రైటర్ గా త్రివిక్రమ్ కి హీరోగా వేణుకి మంచి బ్రేక్ వచ్చింది. అయితే ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ స్టార్ రైటర్ అయిపోయాడు. ఆ తరువాత టాప్ హీరో తో డైరెక్టర్ గా సినిమాలతో బిజీ అయ్యాడు. ఆ సమయంలోనే మహేష్ బాబు తో తీసిన అతడు సినిమాలో సోనూ సూద్ పాత్రకు వేణుని అడిగాడట త్రివిక్రమ్. అయితే విలన్ షేడ్ ఉన్న పాత్ర చేస్తే కెరీర్ లో ఇబందిపడాల్సి వస్తుందని సన్నిహితులు చెప్పడమతో ఆ సినిమా వదులుకున్నాడట వేణు. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక ఒకటి రెండు సార్లు తనతో సినిమా చేయమని త్రివిక్రమ్ ను వేణు అడిగినా ఆ కాంబినేషన్ కుదరలేదని చెప్పాడు వేణు.

వంశీ గారితో ఆ సినిమా చేయలేక పోయాను…
వంశీ డైరెక్షన్ లో గోపి గోపిక గోదావరి సినిమా చేసిన వేణు కి వంశీ గారంటే చాలా ఇష్టం అని చెప్పారు. చాలా గౌరవం అని తనతో ఒక సినిమా అయినా చేయాలని అనుకున్నానని ముందే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పడాల్సి ఉన్నా ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ గోపి గోపిక గోదావరి సినిమాతో ఆ కోరిక తీరింది అంటూ చెప్పారు వేణు. ఇక ఈవివి తో చేసిన సినిమా కెరీర్ లో చేయకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పిన వేణు గతం గతః అని వెళ్లిపోవాలని చెప్పారు.



























