టాక్స్ పేయ‌ర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ శాఖ !! వెంటనే రిఫండ్…!

0
297

కరోనా మహమ్మారి దేశంలో పంజా విసురుతున్న వేళ దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత మరియు వ్యాపార వర్గాలకు లబ్ది చేకూరేలా పెండింగ్ లో ఉన్న రిఫండ్ లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల దృష్యా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుతం ఈనిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ వెల్లడించింది.

ఐదు లక్షల లోపు ఉన్న రిఫండ్ లను తక్షణం విడుదల చేయనున్నారు. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ కేటగిరీలకు చెందిన దాదాపు లక్ష మంది వ్యాపారులకు కూడా లభి చేకూరనుంది. ఇది ఎంఎస్ఎం లకు కూడా వర్తిస్తుందని, ఈ రిఫండ్ లను చెల్లించడం కోసం మొత్తం రూ.18 వేల కోట్లు రిలీజ్ చేయనున్నట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here