సమరసింహా రెడ్డి సినిమాకు ముందుగా అనుకున్న హీరో బాలకృష్ణ కాదని మీకు తెలుసా?

బి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో 1999లో బాలకృష్ణ హీరోగా,అంజలి జావేరి మరియు సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించిన చిత్రం “సమరసింహారెడ్డి”. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు నాంది పలికిన సినిమాగా సమరసింహారెడ్డి సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలయ్య బాబును రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించడం థియేటర్లలో జనాలు విపరీతంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

అప్పట్లోనే ఈ సినిమా సుమారు 70 సెంటర్లలో 100 రోజులు ఆడిందంటేనే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది. గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అయితే ముందుగా సమరసింహా రెడ్డి సినిమాలో నటించడానికి దర్శకులు హీరో బాలకృష్ణను కాకుండా అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న హీరో వెంకటేష్ దగ్గరకు ఈ కథను తీసుకువెళ్లారు.

ఈ సినిమా కథ మొత్తం విన్న వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నా కంటే మంచి బేస్ ఉన్న హీరో అయితే ఇంకా బాగుంటుందని వెంకటేష్ సలహా ఇస్తూ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు బి.గోపాల్ ఈ కథను బాలకృష్ణ దగ్గరకు తీసుకువెళ్లారు. కథ విన్న బాలకృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

ఈ సినిమాలో కథ డైలాగులు మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఉన్నటువంటి “అందాల ఆడబొమ్మ”అనే పాట ఇప్పటికీ శ్రోత్రల మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ సినిమా లో ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఎంతో గొప్ప విజయాన్ని అందుకున్న సమరసింహా రెడ్డి సినిమా వెంకటేష్ ని కాదని బాలకృష్ణ దగ్గరకు వచ్చి సూపర్ హిట్ సాధించిందని తెలుస్తోంది.