లాక్ డౌన్ నేపద్యంలో సెలబ్రేటీ లందరూ ఇంటి వద్దనే ఉండటంతో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఒక నెటిజన్ కాస్త క్లిష్టమైన ప్రశ్ననే వేసాడు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు? అంటూ ప్రశ్నించాడు. విద్యాబాలన్ ఎంతో తెలివిగా చాకచక్యంగా తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్(ఎస్‌ఆర్‌కే) అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. దీనితో పాటు భర్తతో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా షేర్ చేసింది..

ఇక తాగజ విద్యాబాలన్ నటించిన ‘షేర్నీ’ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారిణిగా కనిపించింది విద్యాబాలన్. మనుషులకు, మృగాలకు మధ్య జరిగే కథాంశంతో తీసిన షేర్నీ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చిత్రీకరణ అంటా మధ్యప్రదేశ్ అడవుల్లోనే జరిగింది. ఈ చిత్రం జూన్ 18న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.































