Vignesh Mother: నయనతార ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొని దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అగ్రతారగా కొనసాగుతున్నారు.

దాదాపు ఈమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర కాలం పూర్తి అయ్యింది.అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోయారు. ఇకపోతే నయనతార వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట మరి కొన్ని గంటలలో పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

మహాబలిపురంలోని ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. నయనతార విగ్నేష్ పెళ్లి జరుగుతుంది అంటే అభిమానులు కూడా వీరి పెళ్ళికి ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే నయనతారను కోడలిగా చేసుకోవడం కోసం విగ్నేష్ తల్లి మీనా కుమారి నయనతారకు ఒక షాకింగ్ కండిషన్ పెట్టారట.
నిర్మాణ రంగంలో స్థిరపడనున్న నయన్…
పెళ్లి తర్వాత నయనతార సినిమాల్లో నటించకూడదని తన తల్లి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. తమ ఇంట్లో పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో పద్ధతిగా ఉంటారని ఇలా సినిమాలలో నటించడం ఎవరికీ నచ్చదని, ఈ కండిషన్ కు నయనతార ఒప్పుకుంటేనే తనని కోడలుగా అంగీకరిస్తానని చెప్పారట.ఇకపోతే నయనతార కూడా ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి తాను వెండితెరపై సందడి చేయనని విగ్నేష్ తల్లి పెట్టిన కండిషన్ కు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇకపై ఈమె హీరోయిన్ గా సందడి చేయకుండా కేవలం నిర్మాణరంగంలో కొనసాగుతానని తెలియజేశారట.ఈ విధంగా నయనతార ఇకపై సినిమాలలో నటించదనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.




























