Vijay Devarakonda: లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి వచ్చారు. ఇక వీరిద్దరూ జంటగా లైగర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేశారు. కరణ్ విజయ్ పర్సనల్ విషయాలను గురించి ప్రశ్నించడంతో విజయ్ దేవరకొండ సమాధానం చెప్పారు. అలాగే సెక్స్ గురించి కరణ్ విజయ్ నీ ప్రశ్నించడం గమనార్హం. చివరిసారిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడగగానే విజయ్ ఈ ప్రశ్నను రద్దు చేయండి అంటూ సమాధానం చెప్పారు.

అయితే ఈ ప్రశ్నకు అనన్య పాండే కల్పించుకొని ఈరోజు ఉదయమే కావచ్చు అంటూ సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా సెక్స్ చేశారా అని ప్రశ్నించగా అవును కారులో కొన్ని డెస్పరేట్ టైమ్స్ లో అలా చేయాల్సి వచ్చింది అన్నాడు. దేంతో అనన్య ఒక్కసారిగా షాక్ అయింది.
టైగర్ సినిమాపై పెరిగిన అంచనాలు…
ఈ విధంగా విజయ్ దేవరకొండ కరణ్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ సమాధానం ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాని కరణ్ జోహార్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం గమనార్హం ఈ సినిమా వచ్చే నెల 25వ తేదీ పాన్ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.


























