Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా ఈ పాట గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
ఖుషి సినిమాలో తనకు నచ్చిన పాటలలో ఆరాధ్య పాట ఒకటని తెలిపారు. ఈ పాటలో పెళ్లి అయిన ఏడాది తర్వాత వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలను చాలా అద్భుతంగా చూపించారని తెలిపారు. ఇక పెళ్లి జరిగిన తర్వాత కూడా నా లైఫ్ ఈ పాట మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలియచేశారు.

Vijay Devarakonda:నా జీవితం అలాగే ఉండాలి..
ఈ విధంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ మేము స్నేహితులం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య రహస్య ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని అందరూ భావిస్తున్నారు.