మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా విజయ్ దేవరకొండ ఎన్నో స్థానం లో నిలిచాడు..?

0
134

విజయ్ దేవరకొండ పేరు చెబితే సినీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్,యూత్ లో ఎక్కడలేని వైబ్రేషన్,అమ్మాయిల మనసు దోచుకున్న రొమాంటిక్ యంగ్ లవర్ బాయ్ విజయ్.చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్. ఆ మధ్యకాలంలో”నువ్వే కావాలి” లో నటించిన తరుణ్”మనసంతా నువ్వే’ లో నటించిన ఉదయ్ కిరణ్ లు లవర్ బాయ్స్ గా ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ‌ ప్యాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకోలేక పోయారు. తక్కువ టైములో ఎక్కువ పేరు సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరో విజయ్.

దేవరకొండ”నువ్విలా” సినిమాలో నటించినప్పటికీ సోలో హీరోగా పెళ్లి చూపులు మూవీ తో ఒక సూపర్ సక్సెస్ సాధించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ కావడంతో పెళ్లి చూపులు సినిమా లో అవకాశం కొట్టేశాడు.ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ డ్రామా అర్జున్ రెడ్డి మూవీ వచ్చి యూత్ గుండెలను పిండేసే ఆరేసింది.ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో కబీర్ సింగ్,తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ కాబడింది. ప్రేక్షకులనే కాదు సినీ హీరోయిన్స్ పాత కొత్త అనే తేడా లేకుండా విజయ్ పై క్రష్ ఏర్పడడానికి ఆయన నటించిన అర్జున్ రెడ్డి మూవీనే కారణంగా చెప్పవచ్చు.

ఆ తరవాత వచ్చిన గీతా గోవిందం మూవీలో ఒక స్టేబుల్ అండ్ సెటిల్డ్ క్యారెక్టర్ తో యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కన్విన్స్ చేయగలిగాడు.గీత గోవిందం సక్సెస్ ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…స్టార్ అయ్యావు స్టార్ స్టేటస్ నీ కొచ్చింది ఇప్పుడు తెలుగు టాప్ స్టార్స్ లో నువ్వు ఒక స్టార్ అని విజయ్ ని అభినందించడంతో అక్కడవున్న అభిమానులు కేరింతలు కొట్టారు.
వరల్డ్ ఫేమస్ లవర్ బాయ్ విజయ్ దేవరకొండ “మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్”జాబితాలో చోటు దక్కించుకుని ఏకంగా నేషనల్ లెవల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన సర్వేలో “మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ఇండియా-2019” జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.మొదటి స్థానంలో షాహిద్ కపూర్ రెండవ స్థానంలో రణవీర్ సింగ్ నిలవగా..బాలీవుడ్ సెలబ్రెటీలను వెనుకకు తోసి విజయ్ దేవరకొండ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here