సెలెబ్రెటీ స్టేటస్ వచ్చాక మన మాటలు, చేతలు అన్ని కాస్త కంట్రోల్ లో ఉండాలి.. ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యేవారు చాలామందే ఉంటారు. ఖచ్చితంగా మీరు మాట్లాడేమాటలు వారిపై ప్రభావం చూపిస్తాయి.. ముఖ్యంగా సినిమా హీరోలు ఏమి మాట్లాడినా ఆలోచించి మాట్లాడాల్సిన భాద్యత ఉంది. అయితే తాజాగా.. టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో రాశి ఖన్నాని బాడీ పార్ట్స్ ని ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి..
అసలు విషయానికి వస్తే “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఒక ఛానల్ కి విజయ్ తన సినిమాలోని ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, ఇషా బెల్లాలతో కలిసి ఇంటర్వూ ఇచ్చాడు. ఈ క్రమంలో రాశి ఖన్నాని “ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తారు… ” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె “డాక్టర్ తో చేస్తా… వారైతే బాగా అర్ధం చేసుకుంటారు…” అని బదులిచ్చింది. వెంటనే విజయ్ కలగజేసుకుని “కానీ వాళ్ళు అస్సలు టైం ఇవ్వరు తెలుసా… తాను నిన్ను చూసినపుడు నిన్ను నిన్నుగా చూడలేడు.. నీ బుగ్గలు చుస్తే మెడికల్ టర్మనాలజీలోనే చూస్తారు… ని చెస్ట్ ని చుస్తే… అప్పర్ తోరాక్స్.. ” అంటూ తన బాడీ పార్ట్స్ వివరించే ప్రయత్నం చేస్తుండగా.. రాశి కలుగజేసుకుని “అర్జున్ రెడ్డి చేయడం వల్ల నీకు టర్మనాలజీ తెలిసిందా… ” అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది.
అయితే ఇదంతా అక్కడ చూడటానికి ఫన్నీగా అనిపించినా.. విజయ్ కొంచెం హద్దు మీరు మాట్లాడారు అన్నది వాస్తవం. విజయ్ లాంటి మంచి క్రేజ్ ఉన్న నటుడు, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫేమస్ హీరో. అందులోను మీడియా ముందు మాట్లాడేప్పుడు కొంచెం భాద్యత వహించాల్సింది.. ఒక అమ్మాయిని నీ చెస్ట్.. బుగ్గలు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంత వరకు సబబు ? ఇలాంటి మాటలతో మీ అభిమానులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు ? అయితే ఈ వీడియో చుసిన విజయ్ అభిమానులు సైతం “భయ్యా నువ్వు ఇలా మాట్లాడాల్సింది కాదు..” అందు మందలిస్తున్నారు.
_ @TheDeverakonda Bhayya, neeku lakhs.lo fans unnaru, konchem alochinchi maatladalsina responsibility undhi nee meeda. pic.twitter.com/tUQobMeBOa
— Delivery Of Thoughts (@DotsByHari) February 13, 2020





























