VijayaShanthi : నిన్న జరిగిన ఆసియా కప్ పోటిల్లో ఇండియా మరోసారి పాకిస్థాన్ తో తలపడింది, అయితే ఈ సారి పాకిస్థాన్ గెలిచి ఇండియాను ఓడించింది. దీనికి ఇండియన్ క్రికెట్ లవర్స్ బాధపడ్డారు. అయితే బిజేపి నాయకురాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ పాకిస్థాన్ గెలుపుకి బాధపడితే వాళ్ళు మనకు సమవుజ్జిలు అని అనుకోవాల్సి వస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేసారు.

ఆ గెలుపుకు విలువ ఇస్తే మన సమవుజ్జిలుగా వాళ్ళను చూడాల్సి వస్తుంది…
ఇండియా క్రికెట్ టీం ఎన్నో టీంలతో క్రికెట్ ఆడుతుంటుంది, అందులో గెలుపు ఓటములు సహజం కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ ని మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా చూడాలి. పదే పదే ఇండియా తో ఓడిపోతున్నా పాకిస్థాన్ ఇపుడు గెలిచినందుకు వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదు కానీ వాళ్ళతో ఓడిపోయినందుకు మనం దానికి బాధపడి వాళ్లకు విలువనిచ్చి మనతో సమానం అన్నట్లు చేస్తున్నాం. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, శ్రీలంక వంటి దిగ్గజ క్రికెట్ టీంలు బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, జింబాబ్వే వంటి పసికూనల చేతిలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక కేవలం పాకిస్థాన్ తో మ్యాచ్ అనగానే మీడియా హడావిడి చేయడం ఎందుకు, అందులోనూ క్రికెట్ మాత్రమే క్రీడ కాదు ఇంకా సాకర్, టెన్నిస్, కబడ్డీ వంటి ఎన్నో గేమ్స్ కి కూడా అలానే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.

మన ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ బతుకుతున్న వారి ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుని ఇప్పుడు చివరికి జూ లో జంతువులను కూడా అమ్ముకుంటున్న దుస్థితి లో ఉన్న పాకిస్థాన్ ఏ విషయంలోనూ మనకి సరితూగదు, ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదేదో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగని వ్యవహారం. ఎన్నో క్రికెట్ టీంలతో మ్యాచ్ లు ఆడేటపుడు ఇండియా గెలుస్తుంటుంది ఓడిపోతుంటుంది కానీ ఒక్క పాకిస్థాన్ విషయంలో ఎందుకు పెద్దగా చేసి చూడటం అంటూ విజయ శాంతి అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఒక్కటే ఆట అన్నట్లు పాకిస్థాన్ ఒక్కటే మనకు ప్రత్యర్థి అన్నట్లు ఆలోచించడం మానేయాలి. మన టీం ఇండియా ఎన్నో రికార్డులను తిరగరాసింది, ఇంకా రాస్తూనే ఉంటుంది అంటూ కామెంట్స్ చేసారు.



























