ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి అందరికి తెలిసిందే.. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తమ ప్రజలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ లు ప్రకటించాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల మందికి సోకినా ఈ మహమ్మారి. దాదాపు 60 వేల మందికి పొట్టనబెట్టుకుంది. మన దేశంలో కూడా ఈ కరోనా పంజా విసుతురుతుంది. నానాటికి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 21రోజుల లాక్ డౌన్ ప్రకటించారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.

అయితే మొదట్లో ఈ మహమ్మారి ప్రభావం మన దేశం మీద పెద్దగా లేదని భావించినా.. ఢిల్లీ మర్కజ్ ఇష్యూ తో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇటు తెలంగాణలో కూడా ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి మళ్ళి మొదటికి వస్తుందని అందువల్ల లాక్ డౌన్ ను మరి కొన్నిరోజులు కొనసాగించాల్సిందిగా ప్రధాని మోడీకి చెప్పినట్లు తెలిపారు.

ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ కు బ్రేక్ ఇవ్వద్దని, ఈ మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలి అంటే మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లేక్ డౌన్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు తానూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ చైర్ పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ విషయాన్నీ తన అధికారిక ఫేస్ బుక్ అకౌంటులో పోస్ట్ చేసారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను.”

విజయశాంతి,

ఛైర్‌పర్సన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here