Vinayakan: నటుడు టి.కె.వినాయకన్ అందరికీ ఎంతో సుపరిచితమైన నటుడు. మలయాళ నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న ఈయన తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో వినాయకన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా ఈయనపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. 2023 అక్టోబర్ టైంలో కూడా వినాయకన్ ఫుల్లుగా తాగేసి పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నాడని పబ్లిక్ వయోలేషన్స్ సెక్షన్ కింద ఈయనపై అప్పట్లో కేసు కూడా నమోదు అయింది. ఇలా తరచూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న ఈయన మరోసారి ఫుల్లుగా తాగి పక్కింటి వారితో గొడవకు దిగారు.
ఇలా ఒళ్ళు తెలియని విధంగా మద్యం సేవించిన నటుడు వినాయకన్ ఒంటి పై దుస్తులు లేకుండా కేవలం టవల్ మాత్రమే చుట్టుకొని పక్కింటి వారితో గొడవకు దిగారు. ఆయన మాటలు కూడా స్పష్టంగా రాని విధంగా మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది. అతని ఇంటి బాల్కనీ నుంచి పక్కింటి వారిపై గొడవ పడుతూ వీరంగం సృష్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మద్యం మత్తులో మలయాళం నటుడు వీరంగం
— TeluguDesk (@telugudesk) January 21, 2025
తన ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి, ఇరుగు పొరుగింటి వారిపై అరుస్తూ, బూతులు తిట్టిన నటుడు వినాయకన్!#vinayakan pic.twitter.com/O0bWCD0uU5
నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తరచూ ఇలాంటి వివాదాలలో నిలవడంతో వెంటనే ఇండస్ట్రీ ఇతనిని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. నటుడిగా ఒక పబ్లిక్ ఫిగర్ అయినటువంటి ఈయన తరచూ ఇలా పబ్లిక్ లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ ఈయన తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.



























