Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.
నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























