మనుషుల బర్త్ డే వేడుకలు మనం నిత్యం చూసేవే.. అయితే మనం ఏంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులు ( శునకాలు, పిల్లులు ) లకు కూడా గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు చేసిన సందర్బాలు కూడా చూసాం.. అయితే కోడికి పుట్టిన రోజు చేయడం కాస్త కొత్తగా ఉంది కదూ.. అదికూడా మన తెలుగు రాష్ట్రాలలోనే..

ఓ కుటుంబం తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కోడి (చిన్ను) పుట్టినరోజు జరిపి వార్తల్లో నిలిచింది. కోడి పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఈ వేడుకకు బంధువులు అందరినీ పిలిచి చిన్నపిల్లాడిలా దానిని ముద్దు చేస్తూ.. ఒల్లో కూర్చోబెట్టుకుని మరీ 2వ ఏడాది పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఇదంతా ఎక్కడో నార్త్ లో కాదు మన తెలుగు రాష్ట్రాలలో జరగడం విశేషం. ఇది ఏ ప్రాంతంలో జరిగిందో పూర్తి వివరాలు తెలియకపోయినా.. ఈ కోడి పుట్టిన రోజు సెలెబ్రేషన్ మాత్రం ప్రస్తుతం నేట్టింట వైరల్ గా మారింది.































