సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా అవసరం అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇకపై భారతీయులు 16 దేశాలకు వెళ్లడానికి ఎటువంటి వీసా అవసరం లేదు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడంచారు. పాస్ పోర్ట్ ఉన్న భారతీయులు వీసా అవసరం లేకుండానే ప్రపంచంలోని 16 దేశాలకు వెళ్లవచ్చని కీలక ప్రకటన చేశారు.

వీసా లేకుండా వెళ్లే దేశాలకు సంబంధించిన జాబితాను విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో పొందుపరిచామని వెల్లడించారు. ఈ దేశాలలో నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులతో పాటు తదితర దేశాలు ఉన్నాయి. మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం చెబుతూ ఈ విషయాలను వెల్లడించారు. మన దేశంలోని పాస్ పోర్ట్ ఉన్న పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పించేందుకు 16 దేశాలున్నాయని అన్నారు.
మలేషియా, న్యూజిలాండ్, శ్రీలంక దేశాలతో పాటు ఇతర దేశాలు ఈ వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని వెల్లడించారు. మయన్మార్, ఇండోనేషియా, ఇరాక్ తదితర దేశాలు మాత్రం వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. వీసా రహిత విధానం వల్ల భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం మరింత సులువవుతుందని వెల్లడించారు. ఈ సౌకర్యాలను కల్పించే దేశాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నమని చెప్పారు.
కేంద్రం పలు దేశాలకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తుండటంపై పర్యాటక ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వీసా రహిత ప్రవేశం కల్పించడం వల్ల ఇతర దేశాలను సులభంగా చుట్టి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తమకెంతో ప్రయోజనం చేకూరుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
































