Vishnu Reddy : ‘మెహబూబ’ సినిమాలో ఆకాష్ హీరో, విలన్ గా విష్ణు రెడ్డి నటించారు. నిజానికి విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ పేజెంట్ విన్నర్. ఇక సినిమాల మీద ఇంట్రస్ట్ తో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో నటించాడు. ఇంకా సినిమా తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఇంకా ఇతర విభాగాలలో పనిచేసి ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇక లవ్ బ్రేక్ అప్ వల్ల మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్ళాను. వాటిలో శిక్షణ తీసుకుని, బ్యాంకాక్ కు ఆరు నెలలు శిక్షణకు వెళ్ళాను. ఆ సమయంలోనే పూరి జగన్నాథ్ గారు సినిమా అవకాశం ఇచ్చారు. ఇక మెహబూబ సినిమాలో అవకాశం వచ్చింది.

పూరి జగన్నాథ్ కి అప్పులు ఇంకా ఉండేవి…
2007 సమయం నుండే పూరి జగన్నాథ్ కి అప్పులు ఉండేవి. పూరి జగన్నాథ్ కి గాడ్జెట్స్, కార్లు అంటే చాలా ఇష్టం. 2007 తరువాత ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేక కొత్త కారు కొనలేదు. ఇక పూరి కనెక్ట్స్ ఏర్పాటు చేసిన తరువాత కూడా ఆర్థిక కష్టాలు పోలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత పూరి గారు రెండు కొత్త కార్లు కొన్నారు అంటూ ఆయన ఆర్థిక కష్టాల గురించి మాట్లాడారు. ఇక వేరే సినిమాల్లో మంచి ఆఫర్స్ వచ్చినా పూరి జగన్నాథ్ తో ఉండటానికి కారణాన్ని విష్ణు రెడ్డి వివరించాడు. పూరి జగన్నాథ్ తో ఉంటే ఏంతో నేర్చుకుంటాం, పని తప్ప వేరే ఆలోచన ఉండదు.

ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడటం ఆయనతో చూడలేదు. ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. అలాంటి మనుషులు చాలా ఆరుదుగా ఉంటారు. అందుకేనేమో నాకు ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది ఇక ఆయన ఇబ్బందుల్లో ఉన్నపుడు అక్కడ నా అవసరం ఉంది అని అనిపించింది. అందుకే ఆయనతో ఉన్నాను. నాకు అవకాశాలు మళ్ళీ అయినా వస్తాయి అనిపించి ఆయనతో ఉన్నాను. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్ జనరల్ బాడీ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారి ప్రాజెక్ట్ చేద్దాం అన్నారు, ఇప్పుడు వెళ్లి కలవాలి అని చెప్పారు.