Vishwak Sen: విశ్వక్ సేన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు ఈ హీరో తెలియకపోయినప్పటికీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో ద్వారా తెలియని వారికి కూడా ఈయన పరిచయమయ్యారు. ఇకపోతే ఈయన ఫలక్నమాదాస్,నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఈయన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సినిమా మంచి విజయం సాధించి అవకాశాలు రావడంతో విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈయన అమాంతం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారు. ఇది వరకు ఒక్కో సినిమాకు 1.5 నుంచి 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాలకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు.
మూడు కోట్లు డిమాండ్…
ఈ విధంగా విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈయన ఒకేసారి అంత రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో ఈయన ఇబ్బందులలో పడతారని కామెంట్లు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ నిర్ణయంతో విశ్వక్ నిర్మాతలకు గట్టి ఝలక్ ఇచ్చారు.






























