Vishwak Sen: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఇకపోతే తాజాగా ఈయన ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం కట్టుబడే ఉండే వ్యక్తి విశ్వక్ అంటూ కామెంట్ చేశారు.

వ్యక్తిగతంగా ఈయన పర్సనాలిటీకి తాను అభిమానిని ప్రతి గల్లీలోనూ విశ్వక్ కి అభిమానులు ఉన్నారంటూ ఈయన విశ్వక్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. తనకు మాట మీద నిలబడే వారంటే చాలా ఇష్టం అది మంచైనా చెడైనా ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తులలో విశ్వక్ ఒకరు అంటూ రాంచరణ్ ఓరి దేవుడా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ గురించి చెప్పిన మాటలు ఇవి.
ఈ విధంగా రాంచరణ్ విశ్వక్ గురించి ప్రశంసలు కురిపించిన కొద్ది రోజులకే ఆయన ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా ఒక స్టార్ హీరో గౌరవ మర్యాదలపై దెబ్బ కొట్టారని తెలుస్తోంది. సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ తో సినిమా చేయాలని భావించిన సంగతి మనకు తెలిసిందే తీరా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయానికి ఈయన సినిమా నుంచి తప్పుకుంటున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది.

Vishwak Sen: మాటతప్పిన విశ్వక్..
విశ్వక్ అర్జున్ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మా ప్రెసిడెంట్ విష్ణు వంటి ఎంతోమంది ఈ సినిమా పూజా కార్యక్రమాలలో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలియడంతో పవన్ కళ్యాణ్ కొట్టిన క్లాప్ వృధా అయ్యింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ మాట మీద నిలబడే వ్యక్తి విశ్వక్ అని చెప్పడంతో ఈయన ఎక్కడ నిలబడ్డారు.. మాట తప్పి రామ్ చరణ్ పరువు మొత్తం తీశారు కదా అంటూ పెద్ద ఎత్తున నేటిజన్ లు విశ్వక్ సేన్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.





























