Vizag murder case : తెలిసీ తెలియని వయసులో ఒకరి ఆకర్షణలో పడి ప్రేమ అని దానికి పేరు పెట్టుకుని వారిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఇది కాలేజ్ రోజుల్లో అయితే పర్వాలేదు కానీ మరీ స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ప్రేమ అంటూ తిరిగితే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. అలాగని వారిని గట్టిగా మందలిస్తే ఏం చేస్తారో అన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతుంది. కానీ తాజాగా ఒక తండ్రి మాత్రం కూతురు ప్రేమించిందని తెలిసీ ఏకంగా ఆమెను స్వయంగా తానే చంపి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

చంపి సెల్ఫీ వీడియో…. ఆ తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి…
వైజాగ్ లోని కలెక్టర్ ఆఫీస్ వద్ద రెల్లి ఏరియాలో నివాసం ఉంటున్న వడ్డాది వరప్రసాద్ కి ఇద్దరు కుమార్తెలు. 13 ఏళ్ళ క్రితమే భార్య వదిలి వెళ్ళిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలను పెంచుతూ ఉన్న వరప్రసాద్ కు పెద్దమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దీంతో రెండో కూతురు లిఖిత శ్రీ మీద ఆశలను పెట్టుకుని ప్రవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నా కూతురును బాగా చదివిస్తూ ఉన్న ఆయన కూతురు పదవ తరగతి చదువుతూ ఉన్న మైనర్ బాలిక ఎవరినో ప్రేమించింది.
ఈ విషయం తెలుసుకున్న లిఖిత శ్రీ తండ్రి ఆమెను ప్రేమ గీమా వద్దు అంటూ వారించాడు. కానీ లిఖిత వినలేదు. దీంతో కోపం తో ఆమెను కొట్టి గొంతు నులిమి స్వయంగా కడతేర్చాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసి తాను కూతురిని ఎందుకు చంపాడో వివరించారు. ఆ తరువాత ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలం చేరుకొని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అటు విశాఖ లోనే కాకుండా రాష్ట్రమంతా సంచలంగా మారింది.

































