VJ Sunny : డబ్బులు, సింపతీతో బిగ్ బాస్ గెలిచారా….బిగ్ బాస్ లో ఆ అమ్మాయితో గోవాకి వెళ్ళారా.. అలా వెళితే తప్పేంటి…,పెళ్ళై ఇద్దరు పిల్లలు…: విజే సన్నీ

0
197

VJ Sunny :జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆపైన వీడియో జాకీ గా అలాగే సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న విజే సన్నీ అపైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. అప్పటికే సకాల గుణభి రామ అనే సినిమా చేసిన అది ఎపుడు వచ్చిందో ఎపుడు వెళ్లిందో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం మాత్రం వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు విజే సన్నీ. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్ సినిమా విశేషాలతో పాటు తన బిగ్ బాస్ ముచ్చట్లను ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు.

సింపతీ తో బిగ్ బాస్ గెలిచావా….

బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సన్నీ ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను సింపతీ తో వొట్లు సంపాదించి గెలిచానని కొందరు కామెంట్స్ చేసిన పెద్దగా పట్టించుకోనని చెప్పారు. ఇక డబ్బుతో బయట పిఆర్ టీంలను పెట్టి గెలిచానని మాట్లాడుతూరు కానీ నా దగ్గర బిగ్ బాస్ కి వచ్చే ముందు ఉన్న డబ్బు 30 వేలు అంతకు మించి లేదు. అదికూడా బట్టలు మంచివి కొనడానికే అయిపోయాయి. ఇక ఇంకా బట్టలు కావాల్సి ఉన్న నా స్నేహితుల వద్ద తీసుకున్నాను.

ఇక నా స్నేహితులే నా సోషల్ మీడియను మెయిన్ టైన్ చేసారు. నేను డబ్బు పెట్టి ఏ పిఆర్ టీంను కొనలేదు అంటూ చెప్పారు సన్నీ. ఇక తనకు పెళ్లయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ వచ్చిన రూమర్స్ మీద మాట్లాడుతూ అలాంటిదేమి లేదని కెరీర్ లోనే ఇంకా పైకి రాలేదు అప్పుడే పెళ్లి ఎలా చేసుకుంటాను అంటూ చెప్పారు. ఇక గోవా కి బిగ్ బాస్ లో పరిచయమైన అమ్మాయితో వెళ్ళానని వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ నేను వెళ్ళింది బిగ్ బాస్ కాంటెస్టంట్ అయినా రాజశేఖర్ తో వెళ్ళాను అమ్మాయితో వెళ్ళున్న బాగుండు. అయినా ఒకవేళ అలా అమ్మాయితో వెళ్లిన తప్పేంటి అందులో అంటూ చెప్పారు సన్నీ.