కోవిడ్ 19 వైరస్ బారినపడి రోజుకు కొన్ని వేలమంది చనిపోతున్న కధనాలను చదివి జనం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భీతిల్లుతున్నారు. కరోనాను నివారించే మందు కోసం ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్న ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ వి. ఎస్.రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ ప్రివెంటివ్ మెడిసిన్ కరోనాని నివారించేలా ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య మీడియా తో ఇంటర్వ్యూ ఇచ్చిన డాక్టర్ వి.ఎస్ రెడ్డి ఈ కరోనా వైరస్ కి మందు తాను కనిపెట్టానని, హోమియోపతి వైద్యంలో గత పాతికేళ్ళుగా అనుభవం ఉన్న ఆస్పత్రిగా తమ హాస్పిటల్ కి మంచి పేరు ఉందని, ఈ మందు అన్ని రకాల జ్వరాలకు పని చేస్తుందని, ఈ మందును వాడితే కరోనా వైరస్ బారిన పడిన రోగులు 24 గంటల నుంచి 14రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని, తాను తమ బృందంతో కలిసి ఈ మందును స్వయంగా తయారు చేశానని, కార్పొరేట్ సంస్ధలు చేయలేని పనిని తాము చేస్తున్నామని‌, హోమియో మరియు జర్మన్ న్యూ మెడిసిన్ ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందనీ మరియు కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని ఘంటా పథంగా చాలెంజ్ చేస్తున్నారు.

హాస్పిటల్లో పేషెంట్లు గానీ, సిబ్బంది కానీ, తన కుమారుడు కూడా మాస్క్, సానిటైజర్ గానీ గత 120 రోజులుగా వాడలేదనీ ఈ సందర్భంగా చెప్పడం విశేషం. హాస్పిటల్ గుమ్మం ముందు ప్రతీరోజూ ఒక లిక్విడ్ చల్లుతామనీ దాని వలన ఎంత మంది కరోనా పాజిటివ్ రోగులు ప్రవేశించినా వైరస్ లోపలికి రాదని, ప్రాణాపాయ స్థితిలో, కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న కరోనా పేషెంట్లను కూడా తను ట్రీట్ చేసి 12 గంటల్లో డిశ్ఛార్జి చేయించానని ధీమాగా చెబుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారేనని, ఆయనకు ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే, వారి స్టాఫులో ఇద్దరికి తప్ప 16 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఆ ఇద్దరూ తన మెడిసిన్ వాడకపోవడం వలనే కరోనా వైరస్ బారిన పడ్డారని, తన మందుల గురించి ఎవరైనా పరిశోధించుకోవచ్చని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇక్కడ పని చేసే స్టాఫ్ కూడా ఇంత వరకు కనీసం సానిటైసర్, మాస్క్ కూడా దరించకుండా డ్యూటీలు చేస్తున్నామని, చెబుతుండటం మరో ట్విస్ట్. ఇక్కడిచ్చే హోమియో మందులు కరోనా వైరస్ కి విరుగుడుగా పని చేస్తాయని ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అందరికీ ఈ మెడిసిన్ ఉపయోగించవచ్చని.. ఇలాంటి విపత్కార సమయంలో రోగులకు కూడి ఇక్కడ ట్రీట్మెంట్ చేయవచ్చునంటున్నారు.

కరోనా పాజిటివ్ రావడంతో తమ కుటుంబ సభ్యుడ్ని చాలా హాస్పిటల్స్ తిప్పి తిప్పి డబ్బులు ఖర్చు చేశాం తప్ప జబ్బు నయం కాలేదని, చివరగా డా. వి.ఎస్. రెడ్డి దగ్గరకి తీసుకువచ్చి హోమియో మందులు వాడిన వారం రోజుల్లోనే కరోనా నెగెటివ్ వచ్చిందని కరోనా రోగి బంధువు ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తానికి ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తూ కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో.. వ్యాక్సిన్ కోసం దేశ దేశాలు ఆవస్ధలు పడుతున్న నేపధ్యంలో వరంగల్ హోమియో డాక్టర్ వి. ఎన్. రెడ్డి గా మెడిసిన్ వార్త స్ధానిక ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మందు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ వి. ఎన్. రెడ్డి మీడియాకు తెలియ జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here