ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన కనిపిస్తోంది. బంగాళాఖాతం కేంద్రంగా 15 నుంచి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై అధికంగా పడే అవకాశం ఉండడంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు: 1800 425 3077
































