ఒకప్పుడు పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా భయ పడేవారు. అప్పట్లో ఆరెండు చాలా కష్టమే మరి.. అయితే మరి ఇప్పుడు బ్యాంకులు అనేక అవసరాల కోసం రుణాలు ఇస్తుంటాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి ‘పెళ్లి’. పెళ్లి తంతు అనగానే హంగులు, ఆర్భాటాలు.. ఘనంగా చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే సరిపోతుందా? దానికి తగినంత డబ్బు కూడా కావాలి కదా..! మరి అలాంటప్పుడు పెళ్లికోసం లోన్లు ఇస్తే బాగుటుంది కదా అని కొన్ని బ్యాంకులు లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే అలా ఘనంగా పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారికి ఈ మధ్య బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. వెడ్డింగ్ లోన్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకులు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సర కాలంలో ఈ వెడ్డింగ్ లోన్స్ విపరీతంగా పెరిగాయట. అంతేకాదు అప్లై చేస్తున్న వారిలో అబ్బాయిల కంటే.. అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట.

నిజమే పెళ్లి లో అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా.. జ్యుయలరీ, చీరలు, పెళ్లిళ్లు కూడా వారి దగ్గరే చేస్తారు కాబట్టి ఫంక్షన్ హాల్స్ బుక్ చేయాలి, క్యాటరింగ్ పనులు చూడాలి. బందువులకు, వచ్చిన వారికీ సరైన ఏర్పాట్లు చేయాలి. పెళ్లి చేయడం అంత సులువైన పని కాదు. చాలా శ్రమతో కూడున్న వ్యవహారం. పెళ్లి ఘనంగా చేయాలని భావిస్తారు. పైగా పెళ్లి చేయడాన్ని స్టేటస్‌గా కూడా భావిస్తారు. ఊర్లో వారందరూ చెప్పుకునేలా పెళ్లి జరిపించేందుకు దాచుకున్న డబ్బులను పెళ్లికి ఖర్చు చేసేస్తారు. ఇలా పెళ్లంటే చాలా పనులే ఉంటాయి కదా.. మరి వాటన్నికి డబ్బులు కావలి కదా.. ఇప్పుడు ఈవే కారణాలు చూపించి లోన్స్ అడుగుతున్నారట. కొందరు లక్ష రెండు లక్షలు అడుగుతుంటే… మరి కొందరు మాత్రం.. ఏకంగా అర కోటి పైగా అడుగుతున్నారట. ఈ మధ్య అమ్మాయిలు పెళ్లి భారం తల్లిదండ్రుల మీద మోపకూడదు అని అనుకుతున్నారట. అందుకే ఈలోన్స్ కి డిమాండ్ బాగా పెరిందట. ఇంకేంటి లోన్స్ అప్లై చేయాలనుకునే వారు వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here