హెర్బల్ టీని తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు. దీనికి ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ తాగడానికి మాత్రం సంశయిస్తుంటారు. ఇది తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే.. ప్రతీ రోజు ఒక కప్పు అయినా తాగుతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడేస్తుంది. అంతే కాకుండా.. దీనిలో యంటీఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి.

దీని ద్వారా మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి కాపాడటంలో సహాయపడతాయి. శరీరంలో ఎక్కడైనా వాపు, రక్తం గడ్డకట్టడం.. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టీ రుచిగా ఉండాలి, కానీ.. హెల్దీ గా ఉండాలి అనుకునే వారికి హెర్బల్ టీలు మంచి ఆప్షన్. కాఫీ, ట్రూ టీ లో లాగా హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు.
నిద్ర లేమితో బాధపడే వారు దీనిని దర్జాగా తీసుకోవచ్చు. మనసునీ, శరీరాన్నీ ప్రశాంతంగా చేసి హాయిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయి. వ్యాయామం లేదా మరేదైనా శారీరకశ్రమ చేసినప్పుడు అలసట అనిపిస్తుంటుంది. ఆ సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల హాయిగా అనిపిస్తుంది. శరీరంలో ఎక్కడైనా పెయిన్ అనిపించినప్పుడు.. ఇది పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.
అయితే ఇది తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అవేంటంటే.. హెర్బల్ టీలు తీసుకునే సమయంలో కొంచెం కొంచెమే తీసుకోవాలి. అవి కొద్దిగా తీసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యమో ఎక్కువగా తీసుకుంటే అంత అనారోగ్యం కూడా. హెర్బల్ టీని రోజుకి ఒకటి రెండు చిన్న కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. హెర్బల్ టీలో రకాలు చామోమిల్ టీ, పెప్పర్మింట్ టీ, జింజర్ టీ, సినమన్ టీ, మింట్ టీ, డాండిలయన్ టీ లు ఉన్నాయి.




























