సాధారణంగా మద్యం సేవించే వారికి రానురాను ఎన్నో సమస్యల ఎదుర్కొంటారని మనకు తెలిసినదే.ఆ మందు తాగడం వల్ల దాని ప్రభావం కాలేయం పై పడి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకోసమే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఎన్నో ప్రకటనలలో మనం చూస్తూనే ఉంటాం. మరికొంతమంది మాత్రం ఎప్పుడో ఒకసారి ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు అఫీషియల్ గా మందు తాగడం మనం చూస్తూ ఉంటాం. అలా తాగడం వల్ల కూడా కొంత వరకు కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

తాజాగా విశాఖ ఆంధ్రా వర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా ఆఫ్రికన్ ట్రైబల్స్ లో చేసిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా ఆఫ్రికాలో మద్యం సేవించేవారు అందులో మంచింగ్ కోసం పచ్చి మిరపకాయలను తీసుకుంటున్న వారిలో ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ లేవని ఈ అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా పచ్చిమిర్చి లేకుండా కేవలం మందులు మాత్రమే తాగేవారిలో అనేక సమస్యలతో పాటు లివర్ సమస్యలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలియజేశారు.
అయితే మందు తాగే టప్పుడు ఇలా అదనంగా పచ్చిమిర్చి ముక్కలను తీసుకోవడం ద్వారా ఎటువంటి కాలేయ సంబంధిత సమస్యలు లేకుండా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించి ఎక్కువ మొత్తంలో మందు తాగుతూ, పచ్చి మిర్చి తినడం వల్ల మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిట్కాలు కేవలం ఎప్పుడో ఒకసారి మద్యం తాగాలనిపించిన వారు మాత్రమే ఈ చిట్కాలను ఉపయోగించి తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని చెప్పవచ్చు. అంతే కాకుండా ప్రతి రోజు మద్యం తాగేవారు, ఈ పచ్చిమిర్చిని తినడం ద్వారా మరి కొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





























