ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఎలమర్రు గ్రామంలో 1964 ఆగస్టు 15 వ తేదీన జన్మించారు శ్రీహరి. అతని చిన్నతనంలోనే హైదరాబాద్ నగరానికి మకాం మార్చిన శ్రీహరి కుటుంబం బాలాజీ నగర్ లో స్థిరపడి పోయింది. శ్రీహరి మొదటగా స్టంట్ ఫైటర్ గా సినిమా లో అరంగేట్రం చేశారు. జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం పొందిన శ్రీహరి కి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ అవకాశం వచ్చింది. కొన్నేళ్ళ తర్వాత రైల్వే ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఈ రెండూ ఉద్యోగాలలో శ్రీహరి జాయిన్ అవ్వకుండా సినిమాపై ఆసక్తి తో టాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టారు. బ్రహ్మ నాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, ముఠామేస్త్రి, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 1999 వ సంవత్సరంలో పోలీస్ అనే సినిమాలో మొట్టమొదటిగా హీరోగా కనిపించిన శ్రీహరి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీహరి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో భద్రాచలం సూపర్ హిట్ గా నిలిచింది.

వయసు పైబడిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించారు శ్రీహరి. అయితే శ్రీహరి 1991 వ సంవత్సరంలో డిస్కో శాంతి అనే నటీమణి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు( ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె) కూడా జన్మించారు. అయితే కేవలం నాలుగు నెలల వయసులోనే అక్షర అనే పేరుగల శ్రీహరి కూతురు చనిపోయింది. దీంతో అక్షర పేరిట ఆమెను గుర్తు చేసుకుంటూ అక్షర ఫౌండేషన్ ప్రారంభించి స్కూల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు… మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాగే గ్రామాలకు ఫ్లోరైడ్ ఫ్రీ నీటిని సరఫరా చేయడం ప్రారంభించారు.

ఇకపోతే శ్రీహరి తన చిన్నతనం నుండే బాడీ బిల్డింగ్ పై బాగా ఆసక్తి పెంచుకొని రోజులో చాలా గంటల పాటు వ్యాయామం చేసేవారు. అలాగే మద్యం కూడా బాగా పుచ్చుకునేవారు. గుట్కా పాన్ వంటివి కూడా బాగా నమిలే వారు. అయితే అతని పక్కన ఒక అసిస్టెంట్ ఎప్పుడు చెంబు పట్టుకొని ఉండేవాడట. దీని అర్థం శ్రీహరి ఎప్పుడూ గుట్కా నములుతూ ఒక చెంబు నిండా ఉమ్మి వేసేవారట. అయితే ఈ చెడు అలవాట్లతో పాటు మద్యం కూడా విపరీతంగా తాగడం వలన అతని ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యింది. చాలా సందర్భాలలో శ్రీహరి నిద్ర పోకుండా మందు తాగుతూనే ఉండేవారట. అలా మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన అతని ఆరోగ్యంపై బాగా చెడు ప్రభావం చూపింది.

ఒకరోజు షూటింగ్ నిమిత్తం ముంబై నగరానికి వెళ్లిన శ్రీహరికి జ్వరం వచ్చింది. అయితే ముంబాయి నగరంలోనే ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పటికే అతనికి 102 జ్వరం ఉంది. ఈ విషయం అతని మేకప్ మ్యాన్ డిస్కో శాంతి కి ఫోన్ చేసి తెలిపారు. దాంతో డిస్కో శాంతి వెంటనే ముంబై నగరానికి బయలుదేరారు. ఆమె అక్కడికి వెళ్ళిన అనంతరం శ్రీహరి పరిస్థితి బాగానే ఉందని తీసుకున్నారు. ఆమెతో శ్రీహరి 12 గంటల వరకు బాగానే మాట్లాడారు. అయితే 12 గంటల వరకు బాగానే మాట్లాడిన శ్రీ హరి తర్వాత ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో డిస్కో శాంతి ఆసుపత్రి సిబ్బందిని గట్టిగా పిలిచింది. అప్పుడు నర్సులు వచ్చి శ్రీహరికి సెలైన్ పెట్టి వెళ్ళిపోయారు. మేకప్ మ్యాన్ శ్రీహరి పక్కనే కాసేపు ఉండి బయట కూర్చున్న డిస్కో శాంతి వద్దకు వచ్చి శ్రీహరి సార్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పారు. డిస్కోశాంతి అతనికి డబ్బులు ఇచ్చి ఆసుపత్రి బిల్ రూ. 7.50లక్షలు కట్టాల్సిందిగా కోరారు. అతను బిల్లు కట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత డిస్కో శాంతి శ్రీహరి ఉన్న ఆసుపత్రి రూమ్ లోకి వచ్చి చూసారు. అప్పుడు శ్రీహరి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం వరదలా పారుతుంది. ఈ ఘటన చూసిన వెంటనే భయపడి గట్టిగా అరవడం ప్రారంభించారు శాంతి.

అంతలోనే ఆసుపత్రి సిబ్బంది శ్రీహరి దగ్గరికి వచ్చి అతని పరిస్థితి ఏమీ బాగోలేదు అని చెప్పారు. దీంతో వెంటనే తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారి సహాయంతో ఇతర హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే శ్రీహరి చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని డిస్కో శాంతికి చెప్పి కంట తడిపెట్టుకున్నారు. దీంతో ఆమె గుండెలు బాదుకుంటూ రోధించారు. శ్రీహరి చనిపోయారని తెలుసుకున్న చాలా మంది తెలుగువారు ముంబాయి నగరానికి తరలి వచ్చారు. అప్పుడే ముంబై ఆసుపత్రి డాక్టర్లకు శ్రీహరి అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని సినీ నటుడు అని అర్థమయింది. శ్రీహరి గురించి తలుచుకుంటూ ఇప్పటికీ తన జీవితాన్ని ఒంటరిగా సాగిస్తున్నారు శాంతి. ఏది ఏమైనా ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రీహరి. కేవలం నలభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో అతని మరణం ఒక పీడకల లాగా అందరూ భావించారు.



























