కోనసీమ, సెప్టెంబర్ 2, 2025: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వివాదం రగిలింది. “మీరెంత మీ స్థాయి ఎంత కొడకల్లారా” అంటూ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దళిత సంఘాల నేతలు చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై జనసేన కార్యకర్తలు, దళిత సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కోనసీమ జిల్లా కొత్తపేటలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు నడిరోడ్డుపై కత్తులు, బైక్‌లతో హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెక్సీలను తొలగించడం, అభిమానుల ఆందోళనలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి.
ఈ సంఘటనపై స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రాజకీయ, సామాజిక వర్గాల నుంచి విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.


































