బాలీవుడ్ ధోనీ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా భాధించింది. సుశాంత్ మరణించి 2 వారాలవుతున్నా ఇంకా ఆయన బలవాన్మరనానికి గల కారణాలేమిటో ఇంతవరకూ అర్ధంకాక మీడియాలో రకరకాల గాసిప్స్ చక్కెర్లు కొడుతూనే వున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడని, భారీ సినిమా ప్రాజెక్ట్స్ నుండి సుశాంత్ ను తొలగించటంతో డిప్రెషన్ కి గురైన సుశాంత్ ఈ విధంగా చేసుకున్నట్టుగా ఊహాగానాలు వినబడుతున్నాయి.

సోషల్ మీడియాలో వాటిని చదివిన సుశాంత్ ఫ్యాన్స్, నెటిజన్లు కూడా నెపోయిజంకి కారణమైన బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో కొన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం రాత్రి సుశాంత్ ఓ నటికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం 9.30 సమయంలో సుశాంత్ తన సోదరితో మాట్లాడాడు. ఆ తర్వాత ఉదయాన్నే జ్యూస్ తాగి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉదయం 10గంటల 15 నిమిషాల సమయంలో సుశాంత్ తన పేరును గూగుల్ సెర్చ్ చేసి తన పేరు పై వచ్చిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ను కూడా ఓపెన్ చేశాడు. ఎంతసేపటికీ సుశాంత్ బయటికి రాకపోవడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి అనుమానమొచ్చి వెంటనే సుశాంత్ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు.

విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ హుటాహుటిన సుశాంత్ ఇంటికి వచ్చి తలుపు పగలగొట్టి చూడగానే, బెడ్‌షీట్ సాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న సుశాంత్ విగతజీవిగా కనిపించాడు. ఊహించని ఆ సంఘటనను చూసిన సుశాంత్ ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సుశాంత్ కన్నుముసినట్టుగా తెలియజేశారు. సుశాంత్ నిజంగా డిప్రెషన్ కారణంగానే మరణించి ఉంటే అంతగా డిప్రెషన్ లోకి వెళ్ళడానికి గల కారణాలేమిటి.? అన్న అంశం మీదనే ఇప్పటికే దాదాపు 25 మందిని విచారించిన పోలీసులు ఇంకా కొన్ని కీలకమైన విషయాలను సేకరించే పనిలో వున్నారు. సుశాంత్ మరణం కేసు నిమిత్తం జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు సుశాంత్ కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ నే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా విచారిస్తుండటంతో ఈ కేసు ఏ క్రొత్త మలుపు తిరగబోతుందో అంతుచిక్కకపోవడంతో బాలీవుడ్ బడా బాబులు తలలు పట్టుకు కూర్చున్నారు.



























