ఈ కష్టకాలంలో హీరోయిన్లు ఏమైపోయారు? చిరు స్వయంగా ఫోన్లు చేసి గుర్తు చేయాల్సివస్తుందా ??

0
227

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో కూడా కరోనా పంజా విసురుతోంది ఈ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ ప్రభావం సినీ రంగంపై కూడా పడింది. మొత్తం షూటింగ్స్ అన్ని ఆపేసారు. ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి “కరోనా క్రైసిస్ ఛారిటీ” ఏర్పాటు చేసారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు లేక నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేద కళాకారుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు విరాళాలు అందించారు.

అయితే హీరోయిన్లు మాత్రం ముందుకు రావడంలేదు. ప్రణీత, లావణ్య త్రిపాఠి వంటి వారు తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడంలేదు. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. రెండు సినిమాలు హిట్ అయితే చాలు కోటి కావాలని ముక్కుపిండి మరీ వాసులు చేసే ముద్దుగుమ్మలకు టాలీవుడ్ లో కొదవేలేదు. నయనతార, అనుష్క వంటి వారు అయితే 3 నుంచి 5 కోట్లు తీసుకుంటారు. కాజల్ 2కోట్లకు పైనే వాసులు చేస్తోంది. పూజ హెగ్డే, సమంత, తమన్నా, రష్మిక ఇలా ఎంతో మంది హీరోయిన్లు కోట్లు వెనకేసుకుంటున్నారు.

ఇలా వెనకేసేది జనాల సొమ్ముతోనే కదా.. మరి వాళ్లకు కష్టమొచ్చినపుడు బయటకు తీయడానికి మనసు ఎందుకు రావడంలేదు. ఒకొక్కరు నాలుగైదు భాషల్లో నటిస్తుంటారు. కోట్లు కూడగట్టి బిజినెస్లు చేస్తుంటారు. కానీ జనాలకి కష్టం వస్తే ఒక్కరూపాయి బయటకు తీయరా? ఒక పక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వీళ్ళు మాత్రం హాయిగా ఇంట్లో లైవ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లకు బాధ్యత లేదా ? పారితోషకంగా తీసుకుంటుంది జనం సొమ్మే కదా? మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి సాయం చేయకపోతే ఎలా ? కరోనా బాధితులకు సరే కనీసం సినిమా కార్మికులకు కూడా సహాయం చేయకపోతే వీళ్ళను ఏమనుకోవాలి ?

“కోట్ల పారితోషకాలు తీసుకుంటున్న హీరోయిన్లు కష్టకాలంలో పేద కళాకారులకు ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయం” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.. అంతే కాదు కొంతమంది హీరోయిన్లకు చిరు స్వయంగా ఫోన్లు చేసి మరీ ఇది మీ భాద్యత అంటూ గుర్తు చేస్తున్నారని సమాచారం. చిరు చొరవతో నైనా హీరోయిన్లు ముందుకు వస్తారని ఆశిద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here