బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో థియేటర్లలో సందడి చేస్తున్న అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా విడుదలై మూడు రోజులు అయినప్పటికీ ఇంకా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు పండుగ వాతావరణం నెలకొంది.

ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లు జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం డిసెంబర్ 8వ తేదీ సక్సెస్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ కు ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు. ఇక ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య మంచి రిలేషన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ లో ఇద్దరు స్టార్ హీరోల సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.





























