దేశ వ్యాప్తంగా జరుగుతున్న లాక్ డౌన్ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లాక్ డౌన్ ను ట్రయిల్ గా మార్చి 22న నిర్వచించారని, తోలి లాక్ డౌన్ గా మర్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించిన కేంద్రం ఆ తరువాత ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళి ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు సెకండ్ లాక్ డౌన్ నిర్వహించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట ప్రచారం విపరీతంగా జారుతుంది.

ఈ మ్యాటర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరకు వెళ్లడంతో WHO దీనిపై స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట జరుగుతున్న ప్రచారమంతా ఫేక్ అని.. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా జరుగుతున్న ప్రచారమని WHO తెలిపింది. లాక్ డౌన్స్ పై ఎటువంటి ప్రోటోకాల్స్ విధించలేదంటూ ట్వీట్ చేసింది మినిస్టరీ అఫ్ హెల్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఐక్యరాజ్యసమితి భారత శాఖను ట్యాగ్ చేసింది. ఈ పోస్టుతో భారతదేశంలో సెకండ్ లాక్ డౌన్ కి సంబంధించి WHO ఎటువంటి ప్రకటన చేయలేదని తెలిపింది. భారతదేశ వ్యాప్తంగా 4 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 100 మంది కంటే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.
Messages being circulated on social media as WHO protocol for lockdown are baseless and FAKE.
— WHO South-East Asia (@WHOSEARO) April 5, 2020
WHO does NOT have any protocols for lockdowns. @MoHFW_INDIA @PIB_India @UNinIndia




























