ప్రస్తుతం అందరూ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి టీకాలు వేసుకుంటున్నారు. అయితే ఒక్క కరోనా టీకానే కాదు మిగిలిన అన్ని టీకాలు కూడా భుజానికే చేస్తారు. అసలు భుజనికే ఎందుకు చేస్తారు అనే డౌట్ చాలా మందికి వచ్చి వుంటుంది. అసలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

భుజం పై భాగంలో డెల్టాయిడ్ అనే కండరాలు ఉంటాయి. ఈ డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ కు సంబంధించిన ముఖ్యమైన కణాలు ఉంటాయి. మన శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు వాటియొక్క అవశేషాలను అంటే యాంటీజన్లను ఇవే ముందుగా గుర్తిస్తాయి. అటువంటి యాంటీజన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం జరుగుతుంది. తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుంది. ఈ యాంటీబాడీలు మన శరీరంలో ప్రవేశించిన వైరస్ తో పోరాడి ఆ వైరస్ ను అంతమొందిస్తాయి. ఇదండీ సంగతి.































