‘అహ నా పెళ్లంట’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. 1987 లో విడుదలైన ఈ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేసింది. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, రజిని నటించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ ఎంతగానో కుదరింది. దీంతోనే వారిద్దరి పెయిర్ ఎంతగానో హిట్ అయింది.

ఆ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం ఒక సినిమాలో హీరో, హీరోయిన్ లు హిట్ కొట్టారంటే.. అదే పెయిర్ ను కొనసాగించాలని దర్శక, నిర్మాతలు చూస్తుంటారు. అంతేకాకుండా వాళ్ల మధ్య ఎదో ఉందని.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తుంటాయి. ఈ ఆచారం అప్పట్లో కూడా ఉండేదట. వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకున్నా ఏదో ఉందని అనుకునే వారట. ఎన్నో కథనాలను పత్రికల్లో రాశారని రజిని చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ తో కొంత మంది హీరోయిన్లు నటించమని చెప్పినప్పుడు అతనితో నటించడానికి రజిని ముందుకు వచ్చి ఆయనతో కలిసి నటించడానికి తనను అడిగినప్పుడు తనకు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఒకప్పుడు నేనూ కొత్తే, నేనూ చిన్నే కనుక రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేస్తానని చెప్పి అతనితో సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు.

అందుకే రాంజేంద్రప్రసాద్ కు తను అన్నా.. తన ఫ్యామిలీ అన్న ఎంతో అభిమానం అంటూ చెప్పారు. తను ఎప్పుడూ తన అందానికి గల రహస్యం ఏంటి? అని అడిగేవారని.. మీరు ఏం తింటారు? అంటూ అడిగేవారని తెలిపారు. నా డైట్ ఏంటి.. ఏం తింటుంది అంటూ.. మా అమ్మను అడిగేవారని తెలిపింది. దానికి సమాధానంగా రజిని తల్లి … ప్రత్యేకంగా తనేమీ తినదు బాబు అంటూ చెప్పేదని రజిని చెప్పారు. ఇలా వీరిద్దరు ఎంతో చనువుగాఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అని ఓ సందర్భంలో తెలియజేశారు.





























